Bandi Sanjay: బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది.

Bandi Sanjay: బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు

Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. బండి సంజయ్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చేందుకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

Goa Attack: గోవాలో టూరిస్టులపై కత్తులు, తల్వార్లతో గూండాల దాడి.. స్పందించిన సీఎం

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఈ నోటీసులు తీసుకునేందుకు బీజేపీ కార్యాలయ ప్రతినిధులు నిరాకరించారు. బండి సంజయ్‌కు వ్యక్తిగతంగా వచ్చిన నోటీసులను తామెలా తీసుకుంటామని బీజేపీ కార్యాలయ సిబ్బంది చెప్పారు.

బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల్లో ఉన్నందున నోటీసులను తాము తీసుకోలేమని తెలిపారు. కాగా, బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి. పలు పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు బండిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.