Telangana : CM కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల మాటల తూటాలు .. ఘాటు విమర్శలతో రెచ్చిపోయిన YSRTP అధ్యక్షురాలు

సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.

Telangana : CM కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల మాటల తూటాలు .. ఘాటు విమర్శలతో రెచ్చిపోయిన YSRTP అధ్యక్షురాలు

ys sharmila..CM KCR and Ktr

ys sharmila : CM కేసీఆర్, కేటీఆర్ లపై ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ పైనా..సీఎం కేసీఆర్ పైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, దేశాలు దాటి పచ్చి అబద్ధాలు వల్లించినా అవి నిజాలు అవ్వవు ,కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు,తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు జీవధార కాదు, నీ కుటుంబానికి కమీషన్ల ధార, తెలంగాణ ఖజానాకు కన్నీటి ధార అంటూ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం అంటే తండ్రీకొడుకులు ఎప్పుడు కమీషన్లు కావాలన్నా వాడుకునే ఏటీఎం అంటూ ఆరోపించారు.కాళేశ్వరం
ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఒక అద్భుతం కాదు “మెగా” వైఫల్యం.. మీలాంటి పనిమంతులు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలినట్లు గాలివానకే కూలిన “మెగా” కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సెటైర్లు వేశారు.

 

లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో మీకే తెలియని అయోమయంలో ఉన్నారని..పైకి మాత్రం సాగు,తాగు నీటిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అంటూ గప్పాలు కొడుతున్నారని ప్రపంచానికి నీటి పాఠాలు చెప్పటానికి అమెరికా యాత్ర అంటూ గప్పాలు కొట్టుకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. చిన్న దొర 90 లక్షలు అంటాడు. పెద్ద దొర 45 లక్షల ఎకరాలు అంటాడు..మరోపక్క హరీశ్ రావు అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అంటాడు, ఇంకోపక్క ప్రభుత్వ వెబ్ సైట్ లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం అని చెప్తారు. ఎన్ని ఎకరాలకు నీరిచ్చారే మీకే తెలియదు ఒక్కొక్కరు నోటికి ఏం అంకె వస్తే అది వల్లెవేసి తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు షర్మిల.

 

కమీషన్ల కాళేశ్వరంపై ఎవరి మాట నిజం..? ఎవరి మాట అబద్ధం..? చిన్నదొర చెప్పినట్లు 97 లక్షల ఎకరాలకు కాళేశ్వరమే సాగునీరు అందిస్తే..రాష్ట్రంలో మిగతా సాగునీటి ప్రాజెక్టులు బంద్ పెట్టినట్లా..? ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు చుక్క నీరు ఇవ్వనట్లా..?అని ప్రశ్నించారు. మసిపూసి మారేడు కాయ చేసినట్లు పాత ఆయకట్టును కొత్త ఆయకట్టుగా చూపే కనికట్టు చేస్తున్నారు అంటూ విమర్శించారు. లక్ష కోట్ల కాళేశ్వరం లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో లేదో కానీ …- దొరలు మాత్రం పచ్చి బూటకపు మాటలు చెప్తు..దేశాలు దాటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

 

కమీషన్ల కాళేశ్వరంతో తెలంగాణ దేశానికి ధాన్యాగారం అయితే.. తొమ్మిదేండ్లలో 9 వేల రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు..?- రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు ఎందుకు ఉరి వేసుకుంటున్నట్లు? వరి వేస్తే ఉరి అని సన్నాసి మాటలు ఎందుకు చెప్పినట్లు? దీనికి సమాధానం చెబుతారా? మరి దీనికి చిన్నదొర సమాధానం చెబుతారా? అంటూ కేటీఆర్ పై విమర్శలు సంధించారు. వైట్ ఎలిఫెంట్ లా మారిన కాళేశ్వరంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.