YS Sharmila Challenge : దమ్ముంటే.. నన్ను అసెంబ్లీకి పిలవండి.. వైఎస్ షర్మిల సవాల్

దమ్ముంటే నన్ను అసెంబ్లీకి పిలవండి. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? అసెంబ్లీ లోపలికి రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు రమ్మంటారా? అంటూ చాలెంజ్ చేశారు షర్మిల.

YS Sharmila Challenge : దమ్ముంటే.. నన్ను అసెంబ్లీకి పిలవండి.. వైఎస్ షర్మిల సవాల్

YS Sharmila Challenge : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిల. చాన్స్ చిక్కినప్పుడల్లా ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా షాద్ నగర్ టూర్ లో మరోసారి ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. దమ్ముంటే తనను అసెంబ్లీకి పిలవాలని సవాల్ చేశారు.

పిలిస్తే కాలినడకన వస్తానని, తలెత్తుకు వస్తానని చెప్పారు. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? అంటూ ప్రశ్నించారు షర్మిల. అసెంబ్లీ లోపలికి రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు రమ్మంటారా? అంటూ చాలెంజ్ చేశారు షర్మిల.

”ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఫిర్యాదు ఇచ్చారంట. నా మీద యాక్షన్ తీసుకోమని ఫిర్యాదు ఇచ్చారంట. అవునవును నిజమే. తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారట. ఇక నామీద కేసులు పెడతారట. నన్ను అరెస్ట్ చేస్తారట. లేకపోతే అసెంబ్లీకి రమ్మంటారట, వివరణ కోరతారట. ఎవరు రమ్మనేది నన్ను. రమ్మనండి చూద్దాం.

మీకు దమ్ముంటే నన్ను అసెంబ్లీకి రమ్మనండి. నడుచుకుంటూ వస్తా. కాలి నడకన వస్తా. తలెత్తుకుని వస్తా. ఎప్పుడు రమ్మంటారో మీరు చెప్పండి. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారో చెప్పండి? అసెంబ్లీ లోపలికి రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు రమ్మంటారా? అసెంబ్లీ ముందరే కూర్చుని మాట్లాడతా. పబ్లిక్ మాట్లాడతా. ఏం ప్రశ్నలు అడుగుతారో అడగండి. నేను ఏం తప్పు మాట్లాడానో అడగండి. మీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి మాట్లాడతా. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. పులి బిడ్డ. భయపడేది దాన్ని కాదు నేను” అంటూ ఫైర్ చెరిగారు షర్మిల.

ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల తమపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటీవలే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ను వారు కోరారు. అప్పటి నుంచి.. వారిపై షర్మిల నిప్పులు చెరుగుతున్నారు. తగ్గేదే లే అంటూ.. మరింత దూకుడు పెంచారు షర్మిల.