Seed Cotton Cultivation : విత్తన పత్తిసాగుతో లాభాలు గడిస్తున్న రైతు

దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి.

Seed Cotton Cultivation : విత్తన పత్తిసాగుతో లాభాలు గడిస్తున్న రైతు

Cotton Cultivation

Updated On : November 1, 2023 / 8:53 AM IST

Seed Cotton Cultivation : విత్తుకొద్దీ పంట అని నానుడి. విత్తనం నాణ్యత, జన్యు స్వచ్చతపైన పంట దిగుబడి  ఆధారపడి వుంటుందనటంలో సందేహం లేదు. ఇక సాగులో అధిక దిగుబడి సాధించటానికి, మనం చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు కీలక భూమిక పోషిస్తాయి. వీటన్నిటి కలయికే నాణ్యమైన విత్తనోత్పత్తి. అలాంటి విత్తనోత్పత్తిని ఏలూరు జిల్లాలో పలు కంపెనీలు ప్రోత్సహిస్తుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

తెలుగురాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా దాదాపు 42 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మరి ఇంత విస్తీర్ణానికి విత్తనం సరఫరా చేయాలంటే విత్తన సంస్థలకు… రైతులు, పరిశోధనాస్థానాల తోడ్పాటు తప్పనిసరి. స్వంతంగా విత్తనం తయారుచేసుకోవటం వల్ల రైతుకు ఖర్చు తగ్గటంతో పాటు… కొంత అదనపు ఆదాయం లభించే అవకాశం వుంది.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి. ఏలూరు జిల్లా, లింగపాలెం మండలంలో విత్తనోత్పత్తికి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పలు విత్తన కంపెనీలు  ఈ ప్రాంతాల్లో విత్తనోత్పత్తికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

విత్తనోత్పత్తికి సంబందించి రైతుకు పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, కంపెనీ ఏజంట్లు దగ్గరుండి యాజమాన్యం పర్యవేక్షించటంతో రైతులకు సమస్యలు తక్కువగా వున్నాయి. హైబ్రిడ్ పత్తి విత్తనోత్పత్తిలో ఆడ మగ వరసలను సంకర పరిచే విధానంలో తప్ప, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సాధారణ పత్తిలాగే వుంటాయి.

READ ALSO : Sesame Farming : నువ్వుపంటలో చీడపీడలు.. సస్యరక్షణ

అయితే ఈ విత్తనోత్పత్తి పత్తి సాగుచేసే  గ్రామంలో ఒక కంపెనీకి సంబందించిన విత్తనాలు మాత్రమే నాటాల్సి వుంటుంది. దీనికి సంబందించి రైతులతో ముందస్తు ఒప్పందాలను కంపెనీలు చేసుకుంటాయి. సీడ్ కంపెనీలు రావటం వల్ల మెట్ట వ్యవసాయంలో రైతులకు అందే ఆర్ధిక ప్రయోజనాలు పెరిగాయి. సాధారణ పత్తితో  పోలిస్తే విత్తనోత్పత్తిలో రైతుకు 20 నుండి 50 వేల రాబడి అదనంగా వస్తోంది.