Cotton Hull : రైతుకు అదాయ వనరుగా పత్తికట్టె…

పత్తి కట్టెను తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి హానికలుగుతుంది. అంతేకాకుండా భూములు సారం దెబ్బతింటుంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు ముప్పువాటిల్లుతుంది.

Cotton Hull : రైతుకు అదాయ వనరుగా పత్తికట్టె…

Cotton

Updated On : October 31, 2021 / 9:41 AM IST

Cotton Hull : తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు అధికంగా ఉంది. పంటసాగు పూర్తయిన తరువాత చాలా మంది రైతులు తమ పత్తిపంటను తొలగించి కట్టెను తగలబెడుతుంటారు. కొంత మంది భూమిలో కలియదున్నుతారు. అయితే చాలా మంది రైతులకు పత్తికట్టె ద్వారా ఎంతో కొంత అదాయం సమకూరుతుందన్న విషయం తెలియదు. రైతులు తమ పొలంలో పత్తి తీతలు పూర్తయిన తరువాత పత్తికట్టె పీకించటం, లేకుంటే ట్రాక్టరుతో పొలంలోనే కలియ దున్నించటం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఎండిపోయిన పత్తికట్టె తో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు వచ్చాయి. ప్రస్తుతం మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పత్తికట్టెను వినియోగించి పార్టికల్‌ బోర్డులు, హార్డ్‌ బోర్డులు, కర్రుగేటెడ్‌ బోర్డులు, బాక్సులు, పేపర్‌ పల్ప్‌, ప్యాకింగ్‌ బాక్సులు ప్లైవుడ్‌ తయారు చేస్తున్నారు.ఎండి పత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్‌ తయారీలో వినియోగించవచ్చు. పశువులకు దాణాగా కూడా వాడవచ్చు. పొడి చేసి చేనులో చల్లితే బయోమార్చ్‌గా మారి తేమను నిలిపిఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

పత్తికట్టెను వినియోగించి పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బాయిలర్లలో బొగ్గుకు బదులుగా వాడవచ్చు. ప్యాకింగ్‌ మెటీరియల్‌ తయారీలో, ఫ్లైవుడ్‌ తయారీ, పేపర్‌ తయారీలోనూ పత్తికట్టెను వినియోగిస్తారు. పత్తికట్టెను టన్నుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు చెల్లించి ప్యాక్టరీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. సాధారణం హెక్టారు పత్తి చేనులో 4 టన్నుల పత్తి కర్ర లభ్యమవుతుంది. ప్రతీ రైతుకు హెక్టారుకు రూ. 1,200 నుంచి 1,600 ఆదాయం పత్తెకట్టెను విక్రయించటం ద్వారా సమకూర్చుకోవచ్చు.

పత్తి కట్టెను తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి హానికలుగుతుంది. అంతేకాకుండా భూములు సారం దెబ్బతింటుంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు ముప్పువాటిల్లుతుంది. కట్టెను కాల్చే సమయంలో వచ్చే పొగ కారణంగా వాతావరణం కాలుష్యం ఏర్పడుతుంది. యువత ఉపాధిలో భాగంగా పత్తికట్టె రీసైక్లింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.