Soybean Cultivation : సోయాబీన్‌లో పెరిగిన చీడపీడలు – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

Soybean Cultivation : ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి , సోయా పంటలను సాగుచేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది.

Soybean Cultivation : సోయాబీన్‌లో పెరిగిన చీడపీడలు – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

Soybean Cultivation

Updated On : November 1, 2024 / 2:18 PM IST

Soybean Cultivation : వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉందా పంటల్లో  అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోయా పంటలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటి నివారణ చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి , సోయా పంటలను సాగుచేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడప కురుస్తున్న వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే దిగుబడి చేతికొస్తుంది. లేదంటే రైతులు అప్పుల పాలు కావాల్సిందే. అసలు ఏఏ చీడపీడలు ఆశించాయి.. వాటిని ఏవిధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..