Chrysanthemum Varieties : ఏడాది పొడవునా పూలనిచ్చే చామంతి రకాలు

Chrysanthemum Varieties : రాష్ట్రంలో వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తరువాతి స్ధానం చామంతిదే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు.

Chrysanthemum Varieties : ఏడాది పొడవునా పూలనిచ్చే చామంతి రకాలు

Chrysanthemum Varieties

Chrysanthemum Varieties : చామంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో రైతులు సంవత్సరం పొడవునా పూల దిగుబడిని సాధించవచ్చు. ఒక సారి మొక్కనాటితే రెండు నుంచి మూడేళ్ల పాటు పంట కొనసాగటం విశేషం. అలాంటి చామంతి పూల రకాలపట్ల రైతులకు అవగాహన కల్పించేందుకు .. దేశంలోని పలు ఉద్యాన పరిశోధన కేంద్రాలు రూపొందించిన పలు రకాల చామంతి పూలను వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

రాష్ట్రంలో వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తరువాతి స్ధానం చామంతిదే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. విడిపూలుగా, దండాలు కట్టుటకు, కట్ ప్లవర్ గా చామంతికి చలికాలంలో మంచి గిరాకీ ఉంటుంది. పండుగలు, పర్వదినాలు, పూజలకు చామంతులను తప్పని సరిగా వాడుతుంటారు. పగటి సమయం తక్కువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉండే శీతాకాలంలోనే ఎక్కువగా పూతకు వస్తాయి.

అందుకే చాలా వరకు చామంతిపూలను శీతాకాలంలో నే సాగుచేస్తుంటారు రైతులు. అయితే ఏడాది పొడవునా ఈ పూలకు డిమాండ్ ఉండటంతో దేశంలోని పూల పరిశోధనా కేంద్రాలు అనేక రకాలను రూపొందించారు. వాటన్నీటిలో అత్యుత్తమమైన రకాలను ఎంచుకొని పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ పూల రకాలు, వాటి గుణగణాలు, సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ప్రొఫెసర్లు..

చామంతి రకాలు దీర్ఘకాలంపాటు అంటే 2 నుంచి 3 సంవత్సరాలు పూల దిగుబడినిస్తాయి. కనుక రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా తలలు తుంచడం, నీటితడులు, ఎరువుల యాజమాన్యం సమయానుకూలంగా పాటించాలి. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు, ముడుత పురుగు, ఆకుతొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగ జేస్తాయి. వేరుకుళ్లు తెగులు కూడా ప్రధాన సమస్యగా వుంది.  సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు.

Read Also : Livestock Farming : మెరుగైన జీవానోపాధినిస్తున్న జీవాల పెంపకం