Alternative Fertilizers : రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట పైర్లు

పచ్చిరొట్ట పెంపకంపై ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నది.

Alternative Fertilizers : రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట పైర్లు

Alternative to Chemical Fertilizers

Updated On : June 13, 2023 / 12:31 AM IST

Alternative Fertilizers : ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం.. నేల స్థితిగతులనే మార్చేస్తున్నది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతోపాటు సహజ లక్షణాలనూ దెబ్బ తీస్తున్నది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని సాగుభూమి క్రమంగా కోల్పోతున్నది. అందుకే, కొంతమంది రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడానికి  సాగులో సహజసిద్ధ ఎరువులైన పచ్చిరొట్టను సాగుచేస్తూ.. భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడిపంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి, పంటలో సూక్ష్మపోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తున్నది.

READ ALSO : Robot In Agriculture : వ్యవసాయంలోకి రోబో.. ఎకరంలో కలుపుతీత ఖర్చు రూ. 50

ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.

READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

ఈ పంటలను పొలాల్లో పెంచి, నేలలోనే కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. అధిక దిగుబడులనూ, భారీ లాభాలనూ పొందే అవకాశం ఉన్నది. అందుకోసమే ఖమ్మం జిల్లాకు చెందిన రైతు రాణా ప్రతాప్, ప్రతి రెండేళ్లకోసారి పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి కలియదున్నుతూ.. రసాయన ఎరువుల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో కూరగాయల అమ్ముతున్న యువజంట

పచ్చిరొట్ట పెంపకంపై ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలను రైతులకు రాయితీపై అందిస్తోంది .