Chamanti Farming : పండుగ సీజన్‌లలో డబ్బుల వర్షం కురిపిస్తున్న చామంతి
Chamanti Farming : రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు... వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా, నార్పుల మండలం, వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ.

Natural Farming Benefits
Chamanti Farming : సంప్రదాయ పంటల సాగుతో నష్టాలను చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు చామంతి పూలసాగువైపు దృష్టి సారించారు. సాగులో మెళకువలు తెలుసొని తన వ్యవసాయ క్షేత్రాన్ని పూదోటగా మార్చారు. ప్రస్తుతం దిగుబడుల వస్తుండటం.. ఇటు పండుగల సీజన్ కావడంతో లాభాలు గడిస్తున్నాడు.
రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు… వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా, నార్పుల మండలం, వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ. తనకున్న 6 ఎకరాల్లో రెండు, రెండు ఎకరాలుగా విభజించి విడుతల వారిగా పలు రకాల చామంతులను నాటారు. సాధారణంగా శీతాకాలంలో అధిక దిగుబడులు వస్తుంటాయి.
అందుకే, రైతులు జూన్, జూలై నెలలోనే మొక్కలను నాటుతుంటారు. సరిగ్గా 5 నెలలకు దిగుబడి వస్తుంది. ఆ సమయంలో కార్తీకమాసం, పండుగలు, పెళ్లిళ్లు వరుసగా వస్తుండడంతో పూలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ రైతు మాత్రం దసరా, దీపావళి, సంక్రాతి పండుగలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే నాటారు. ప్రస్తుతం దిగుబడులు వస్తుండటం.. ఇటు పండుగల సీజన్ కావడం.. మార్కెట్ లో ధరలు కూడా పలకడంతో లాభాలు గడిస్తున్నాడు.
ఎప్పటికీ వేసిన పంటలే వేయకుండా వినూత్నంగా ఆలోచించాలి. మార్కెట్ కు అనుగుణంగా పంటలను ఎంచుకొని సాగుచేస్తే.. లాభాలు వాటంతట అవే వస్తాయని నిరూపిస్తున్నారు రైతు రఫీ.
Read Also : Natural Farming Benefits : ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడులు తగ్గించుకుంటున్న రైతులు