Millet Cultivation : చిరుధాన్యాల సాగుతో రైతులకు ఆర్ధిక భరోసా
Millet Cultivation : చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు.

Millet Cultivation
Millet Cultivation : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకే చాలా మంది రైతులు చిరుధాన్యాల సాగుచేపట్టేండుకు మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాల సాగు.. ఉపయోగాల గురించి ఘంటసాల కేవికే శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం..
చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులూ పెద్దగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకొని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. హరిత విప్లవం వచ్చిన తరవాత క్రమంగా వీటి సాగు, ఆహార వినియోగం తగ్గింది. రైతు జీవన ప్రయాణంలో నెమ్మదిగా కుదుపులు మొదలయ్యాయి. ప్రభుత్వాల విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు, రైతులను పాత పంటలకు దూరం చేశాయి.
మరోవైపు దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవడం, చిరుధాన్యాలను విసిరి, దంచి, పొట్టు తీసి వంటకు అనువుగా చేయడం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కర్షకుల్లో వీటి సాగుపట్ల ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఇటీవల ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. గట్టిగా రెండు వానలు పడితే ఇట్టే పంట చేతికి వస్తుంది. అందుకే 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యల సంవత్సరంగా భారత్ ప్రకటించింది. చిరుధాన్యాల సాగు, కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు