Brinjal Cultivation : వంగతోటల్లో పెరిగి చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Brinjal Cultivation : వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారు మడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తుంటాయి.  ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మరి, పాలిపోతుంటాయి.

Brinjal Cultivation : వంగతోటల్లో పెరిగి చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Pest Control in Brinjal Cultivation in Telugu

Updated On : December 20, 2024 / 2:13 PM IST

Brinjal Cultivation : ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేని కూరగాయ పంట వంగ.  అయితే ఈపంట సాగులో రైతులు దృష్ఠిపెట్టాల్సిన అంశం చీడపీడలు. ముఖ్యంగా రసంపీల్చు పురుగులు, కాయ తొలుచు పురుగులు, తెగుళ్లు పంట నాణ్యతను దెబ్బతీస్తూ, అధిక నష్టం చేస్తుంటాయి.

వీటిని సకాలంలో గుర్తించి, నివారణ చేపట్టకపోతే నష్టం అధికంగా వుంటుందంటూ సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. బి. రాజేశ్వరి.

సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు, మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. మిగతా కూరగాయల్లో, ధరల హెచ్చుతగ్గులున్నా… స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంటలుగా, వంగ రైతుల ఆదరణ పొందుతున్నాయి.

ప్రస్తుతం తోటలు నాటిన తొలిదశ నుంచి కోతల వరకు వివిధ దశల్లో వున్నాయి. ఈదశలో కాయతోలుచు పురుగులు, అక్షింతల పురుగులు, ఎర్రనల్లి, రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, దీపపు పురుగుల వల్ల నష్టం ఎక్కువగా వుంటుందంటూ.. సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. బి. రాజేశ్వరి.

వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారు మడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తుంటాయి.  ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మరి, పాలిపోతుంటాయి. తద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక, మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది.

అంతే కాదు దిగుబడులు వచ్చిన అవి నాణ్యత కోల్పోయి, మార్కెట్ లో ధర రాదు. తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వంగకు  మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే మంచి  దిగుబడిని సాధించవచ్చు.

Read Also : Butterfat Milk : చలికాలంలో వెన్నశాతం పెరిగేందుకు చేపట్టాల్సిన చర్యలు