Coconut Cultivation : కొబ్బరిలో రోగోస్ తెగులు నివారణ
కోనసీమ కొబ్బరికి సర్పిలాకార తెల్లదోమ మహమ్మారిలా దాపురించింది . అధిక ఉష్ణోగ్రతల్లో ఈ దోమ వుధృతి అధికమవటంతో చెట్లు క్షీణించి దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

coconut cultivation
Coconut Cultivation : కోనసీమ కొబ్బరికి రోగోస్ తెల్లదోమ రూపంలో కొత్త ఉపద్రవం వచ్చి పడింది. ఇతర దేశాల నుండి నారు మొక్కల రవాణా ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన ఈ సర్పిలాకార తెల్లదోమ బెడదతో రైతులు బెంబేలిత్తిపోతున్నారు . చెట్లన్ని నల్లగా మారిపోయి, కాపు తగ్గిపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నారు . రైతులంతా సంఘటితంగా సస్యరక్షణ పద్ధతులు చేపడితే, ఈ పురుగును సమర్ధంగా అరికట్టవచ్చంటూ సూచిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు.
కోనసీమ కొబ్బరికి సర్పిలాకార తెల్లదోమ మహమ్మారిలా దాపురించింది . అధిక ఉష్ణోగ్రతల్లో ఈ దోమ వుధృతి అధికమవటంతో చెట్లు క్షీణించి దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో 2016వ సంవత్సరంలో గుర్తించిన ఈ తెల్లదోమ క్రమేపి దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ దోమ తాకిడి వల్ల చెట్లు నల్లగా మారిపోతున్నాయి.
READ ALSO : Coconut : కొబ్బరిలో తీగజాతి కూరగాయల సాగు
కొబ్బరిలో అంతరపంటలుగా వేసిన అరటి, కోకో వంటి పంటలకు కూడా ఈ దోమ బెడద తప్పటం లేదు. దీని నివారణకు శాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మురం చేసారు. పురుగు మందుల కంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మంచి ఫలితాలను అందిస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎన్.బి.వి. చలపతిరావు , రైతాంగానికి తెలియజేస్తున్నారు.