Grain Varieties : మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు

ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.

Grain Varieties : మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు

Short and Long Grain Varieties

Grain Varieties : వర్షాలు ఆలస్యం అయినా… కాలువలు, చెరువుల కింద సాగునీరు ఆలస్యమయ్యై ప్రాంతాల్లో  రైతులు మధ్యకాలి వరి రకాలను ఎంపికచేసుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు ఉన్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా  వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.

వరిసాగులో రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి   కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి. ఆలస్యంగా అంటే జూన్ 15 తరువాత నార్లు పోసుకునే వీలున్న మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు .. వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు