Sweet Corn Cultivation : స్వీట్ కార్న్ సాగులో మేలైన యాజమాన్యం

వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు . అయితే తీపి మొక్కజొన్నను సలాడ్ గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశం ఉంది.

Sweet Corn Cultivation : స్వీట్ కార్న్ సాగులో మేలైన యాజమాన్యం

Sweet Corn Cultivation

Sweet Corn Cultivation : స్వీట్ కార్న్ మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో, తక్కవ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రసుత్తం ఖరీఫ్ సీజన్ దగ్గర పడటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే మేలైన రకాలను ఎంచుకుని, సాగులో కొద్దిపాటి మెళకులను పాటిస్తే.. అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్.

READ ALSO : Maize Cultivation : మెట్టప్రాంతంలో సిరులు కురిపిస్తున్న మొక్కజొన్న సాగు

వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు . అయితే తీపి మొక్కజొన్నను సలాడ్ గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశం ఉంది.

అయితే చింతపల్లి వ్యవసాయ పరిశోదనా స్థానం వారు ఫ్రీ ఖరీఫ్ అంటే ఏప్రిల్ లో నాటారు. మరి కొద్దిరోజుల్లో పంట కోత చేపట్టనున్నారు. ఈ పంటను తీయగానే వెంటనే ఆగస్టు వర్షాలను ఉపయోగించుకొని మళ్లి వేయవచ్చని శాస్త్రవేత్త సందీప్ నాయక్ తెలియజేస్తున్నారు. ఈ ఖరీఫ్ లో స్వీట్ కార్న్ సాగుచేయలనుకునే రైతులు, అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎన్నుకొని , మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు.

READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !

విత్తనం మొదలు కొని, నీటియాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతే కాకుండా మార్కెట్ కు అనుగుణంగా ప్రణాళిక బద్దంగా సాగుచేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్ లో ఒక సారి కాకపోయిన మరోసారి మంచి ధర లభించే అవకాశం ఉంది.