Bus Fell Into Valley : కొండపై నుంచి లోయలో పడ్డ టూరిస్టు బస్సు
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.

bus fell into a valley
Bus Fell Into Valley : ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు జిల్లాలోని వనజాంగి వద్ద కొండపైన అదుపుతప్పి లోయలో పడింది. బస్సు విశాఖపట్నం నుంచి పాడేరుకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని బయటికి వెలికితీశారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులకు డాక్టర్లు వైద్యం చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.