Tirupati : తిరుపతి చేరుకున్న 100 టన్నుల సేంద్రియ శనగలు

ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది.

Tirupati : తిరుపతి చేరుకున్న 100 టన్నుల సేంద్రియ శనగలు

Tirupati

Updated On : April 23, 2022 / 7:44 PM IST

Tirupati : తిరుపతికి 100 టన్నుల సేంద్రియ శనగలు చేరుకున్నాయి. శ్రీవారి ప్రసాదాల తయారీలో వినియోగించే సేంద్రీయ శనగలకు మార్కెటింగ్ గోడౌన్ లో టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో గోవిందుడికి నైవేద్యాన్ని సమర్పించాలని పాలకమండలి నిర్ణయించింది.

సేంద్రియ శనగల సరఫరాకు రైతు సాధికారిక సంస్థ, మార్క్ ఫెడ్ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది. ప్రతి ఏడాది లడ్డూ ప్రసాదాల తయారీకి 7 వేల టన్నుల సెనగలు అవసరం ఉంటుంది.

Tirumala : శ్రీవారి లడ్డూలో అనంత ‘పప్పుశనగ’.. రైతుల ఆనందం

896 టన్నుల రెడ్ గ్రామ్ దాల్, 217 టన్నుల బ్లాక్ గ్రామ్ దాల్, 474 టన్నుల బెల్లం, 54 టన్నుల ధనియాలు, 25 టన్నుల పసుపు 237 టన్నుల సోనామసూరి బియ్యం, 22 టన్నుల జీలకర్ర, 83 టన్నుల ఎండుమిర్చి, 284 టన్నుల పెసరపప్పు 25 టన్నుల శనగ కాయలు, సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుండి 1,2 సంవత్సరాల్లో కొనుగోలు చేస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.