ఎన్నికల వేళ పలు రంగాలకు చెందిన వారి మనోగతాన్ని ఆవిష్కరించే ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’

10TV Conclave: ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలకు అనుగుణంగా.. సంక్షేమ‌, స‌మ్మిళిత అభివృద్ధికి పార్టీలు ఎలాంటి ప్రణాళికలతో ఉన్నాయి?

ఎన్నికల వేళ పలు రంగాలకు చెందిన వారి మనోగతాన్ని ఆవిష్కరించే ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’

10TV Conclave

Updated On : April 23, 2024 / 4:39 PM IST

సార్వత్రిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. ఓ వైపు ఆశలపల్లకిలో అన్నదాత.. లాభసాటి సేద్యం కోరుకుంటున్నాడు. మరోవైపు ఉద్యోగ, ఉపాధి మార్గాలపై యువతరం గంపెడాశలు పెట్టుకుంది. తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు కావాలని కోరుకుంటోంది.

మధ్యతరగతి తమ జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఆశిస్తోంది. కార్మిక, ఉద్యోగ వర్గాలు తమ ఉపాధి, ఆర్థిక భద్రతకు భరోసాను కోరుకుంటున్నాయి. మహిళాలోకం, వయోజనులు కూడా తమ సంక్షేమం, భద్రతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలకు అనుగుణంగా.. సంక్షేమ‌, స‌మ్మిళిత అభివృద్ధికి పార్టీలు ఎలాంటి ప్రణాళికలతో ఉన్నాయి?

మెరుగైన జీవితాల‌కు ఎలాంటి మ్యానిఫెస్టోలతో వస్తున్నాయి..? ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నాయి..? అధికార, విపక్ష పార్టీలు, మేథావులు, రాజకీయ పరిశీలకులు, పలు రంగాలకు చెందిన వారి మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది 10టీవీ. ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి ‘‘10TV CONCLAVE AP ROADMAP’’ నాన్‌స్టాప్ కవరేజ్ చూడండి..

 

Also Read: విజయవాడ ఎంపీ సీటు ఆశించా.. ఎమ్మెల్యేగా పోటీ చేయలేను: సుంకర పద్మశ్రీ