19న కొల్ కత్తాలో బీజేపీయేతర కూటమి మీటింగ్

  • Published By: chvmurthy ,Published On : January 9, 2019 / 07:10 AM IST
19న కొల్ కత్తాలో బీజేపీయేతర కూటమి మీటింగ్

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ  వచ్చి బిజీ బిజీ గా గడిపారు ఉన్న4 గంటలలోనే  ఆయన పలువురు నేతలతో సమావేశమై  బీజేపీయేతర కూటమి ఏర్పాట్లపై చర్చించారు. జనవరి19న తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో బీజేపీయేతర కూటమి నాయకులుపాల్గోనున్నారు.ర్యాలీకి ముందువారంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారు. 
మంగళవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకున్నచంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో సమావేశంఅయ్యారు. అనంతరం ఏపీ భవన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  తో సమావేశం అయ్యారు.  ఏపీ భవన్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన  శరద్ పవార్ ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతోనూ సమావేశం అయ్యారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ … దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య అనివార్యత ఉందని అన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం అన్ని బీజేపీయేతర పార్టీలను కలుస్తున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఇబ్బందులున్నప్పటికీ జాతీయ స్థాయిలో అందరూ కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై  కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జనవరి 19న కోల్ కత్తాలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.