ఏపీలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 304 కేసులు
ఏపీలో కరోనా కేసులు శర వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

ఏపీలో కరోనా కేసులు శర వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. కొత్తగా నమోదైన 304 కేసుల్లో రాష్ట్రానికి చెందినవి 246. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 58మందికి వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో 15వేల 173 మంది శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 47మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
* గడిచిన 24 గంటల్లో 304 కరోనా కేసులు(ఏపీకి చెందినవి 246)
* కరోనాతో మరో ఇద్దరు మృతి(కర్నూలులో ఒకరు, అనంతపురంలో ఒకరు)
* మొత్తం కేసుల సంఖ్య 5087
* మొత్తం మరణాల సంఖ్య 86
* యాక్టివ్ కేసులు 2231
* కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2770
* విదేశాల నుంచి వచ్చిన వారిలో 210మందికి కరోనా(యాక్టివ్ కేసులు 187)
* ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1159కి కరోనా(యాక్టివ్ కేసులు 567, 24 గంటల్లో 22మంది డిశ్చార్జి)