AP Covid-19 Positive Cases : ఏపీలో కొత్తగా 993 కరోనా కేసులు, ముగ్గురు మృతి

ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో ముగ్గురు మృతిచెందగా 480 మంది కోలుకున్నారు.

AP Covid-19 Positive Cases : ఏపీలో కొత్తగా 993 కరోనా కేసులు, ముగ్గురు మృతి

Updated On : March 30, 2021 / 6:55 PM IST

Covid-19 Positive Cases in Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో ముగ్గురు మృతిచెందగా 480 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య 8,97,910కి చేరింది.

రాష్ట్రంలో కరోనా 6,614 యాక్టివ్‌ కేసులుండగా.. 7,213 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 30,851 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,50,52,215 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.