నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన పుట్టినరోజు వేడుక

Road Accident: మృతుల పేర్లు సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, నల్లి నవీన్ కుమార్, వల్లూరి అజయ్‌గా పోలీసులు గుర్తించారు.

నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన పుట్టినరోజు వేడుక

Road Accident

Updated On : April 29, 2024 / 10:17 AM IST

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో కొమ్మాబత్తుల జతిన్ అనే యువకుడు గత అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీ ఇచ్చాడు.

అనంతరం జతిన్, వేడుకకు హాజరైన అతడి స్నేహితులు తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుండగా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో అది ఓ లారీని ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన మరో నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆ యువకులు అందరూ అర్ధరాత్రి వరకు యానాంలో బాగా మద్యం సేవించి ఆటోలో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో వేగంగా వెళ్లి లారీని ఢీ కొట్టింది. గాయాలపాలైనవారికి కిమ్స్‌లో చికిత్స అందుతోంది. మృతుల పేర్లు సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, నల్లి నవీన్ కుమార్, వల్లూరి అజయ్ గా పోలీసులు గుర్తించారు.

Also Read: ఈ 2 వన్‌‌ప్లస్ ఫోన్లపై నిలిచిపోయిన సాఫ్ట్‌‌వేర్ అప్‌డేట్స్!