AP Cabinet Decisions: క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు అమరావతిలో 50ఎకరాలు- ఏపీ మంత్రి మండలి నిర్ణయాలివే..

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం..

AP Cabinet Decisions: క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు అమరావతిలో 50ఎకరాలు- ఏపీ మంత్రి మండలి నిర్ణయాలివే..

Updated On : June 4, 2025 / 7:51 PM IST

AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు. ఏడాదిలో 25 ఈ-కేబినెట్లు నిర్వహించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రిమండలి అభినందనలు తెలిపింది. కూటమి సర్కార్ ఏడాది పాలనలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎంకు అభినందనలు తెలిపింది మంత్రి మండలి.

మంత్రి మండలి నిర్ణయాలు..
* ఉద్దానం, కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది ప్లాంట్లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయం
* ఉద్దానంకు 5.75 కోట్లు, కుప్పంకు 8.22 కోట్లు వయబిలిటీ ఫండ్ ఫండ్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం
* ఉద్దానం, కుప్పంలో ప్రజలకు 2 రూపాయలకే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం
* వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద వయబిలిటీ ఫండ్
* ఫిబ్రవరి 1, 2025 నాటికి యావజ్జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయం
* సత్ప్రవర్తన కల్గినందున 17మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం
* సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలకు నిర్ణయం

* ApSpలో 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లకుగా పదోన్నతి
* వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదం
* ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు..
* కార్మిక చట్టాలు సరళంగా ఉంటే పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని అభిప్రాయపడిన మంత్రి మండలి
* ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఓవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పనిచేసే అవకాశం ఉండేది
* ఇకపై మహిళలు క్వాటర్ లో 144 గంటలు ఓవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు ఆమోదం

* పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించడం కోసం నిబంధనల సవరణ
* విశాఖపట్నంలోని హరిత హోటల్ లో యాత్రీ నివాస్ ను అధునీకరించేందుకు పర్యాటక రంగం చేసిన ప్రతిపాదనకు 13 కోట్ల 50 లక్షల ఆమోదం..
* విశాఖలో హరిత హోటల్ ఆధునీకరణకు టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం
* గత ప్రభుత్వం హరిత హోటల్ అభివృద్ధి పనులకు 4.5 కోట్లకు నిర్ణయించి అంచనాలను 13.5 కోట్లకు పెంచింది
* హరిత హోటల్ అభివృద్ధి కోసం 13.50 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి

Also Read: ఆర్సీబీ వియోజత్సవంలో ఘోర విషాదం.. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటలో 10మంది అభిమానులు దుర్మరణం..

* రాజధాని అమరావతి లో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం
* రాజధానిలో క్వాంటం కంప్యూటర్, కృత్రిమ మేధ సంస్థల ఏర్పాటునకు మంత్రి మండలి ఆమోదం
* క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థల ఏర్పాటునకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది
* క్వాంటం కంప్యూటింగ్, ఎఐలో రాబోయే 5-10ఏళ్లలో ఏపీ నెంబర్ 1 స్థానానికి చేరడమే లక్ష్యం
* క్వాంటం కంప్యూటింగ్, ఏఐ సంస్థల్లో స్కూళ్ల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు తర్ఫీదు కోసం చర్యలు

* ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహించాలని నిర్ణయం
* యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అత్యధిక మందితో యోగా చేయించి గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పాలని నిర్ణయం
* రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం
* MSME పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ ఆమోదం