Red Sandalwood : 54 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

చిత్తూరు జిల్లాలో టాస్క్‌ఫోర్స్  పోలీసులు 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

Red Sandalwood : 54 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

54 Red Sandalwood Logs Seized Two Smugglers Arrested

Updated On : June 10, 2021 / 8:21 PM IST

Red Sandalwood : చిత్తూరు జిల్లాలో టాస్క్‌ఫోర్స్  పోలీసులు 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కెవిబి పురం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు సంచరిస్తున్నారనే సమాచారంతో గత 3 రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు.

గురువారం ఉదయం తీర్థాలకోన వద్ద కొంతమంది   ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ పోలీసుల కంటపడ్డారు. వారిలో ఒకరి చేతిలో నాటు తుపాకి కూడా ఉంది. వారిని పోలీసులు చుట్టుముట్టే  ప్రయత్నం చేయగా కొందరు అడవుల్లోకి పారిపోయారు. వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

వారిని సదాశివపురంకు  చెందిన ఏ.ఆంజనేయులు (50), ఎస్ ఎల్ పురం కు చెందిన సత్రవాడ కృష్ణయ్యగా గుర్తించారు. వారిచ్చిన సమాచారం తో అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 54 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు.