5G Services in AP: ఏపీలో మొదలైన 5జీ సేవలు.. ప్రారంభించిన రిలయన్స్ జియో

రిలయన్స్ జియో సంస్థ ముందుగా 5జీ సేవల్ని ఏపీలో ప్రారంభించింది. త్వరలోనే మిగతా నెట్‌వర్క్స్ కూడా 5జీ సేవలు ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం జియో సంస్థ ఏపీలోని ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభించింది.

5G Services in AP: ఏపీలో మొదలైన 5జీ సేవలు.. ప్రారంభించిన రిలయన్స్ జియో

Updated On : December 27, 2022 / 10:32 AM IST

5G Services in AP: ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ సేవలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ జియో సంస్థ ముందుగా 5జీ సేవల్ని ఏపీలో ప్రారంభించింది. త్వరలోనే మిగతా నెట్‌వర్క్స్ కూడా 5జీ సేవలు ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం జియో సంస్థ ఏపీలోని ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభించింది.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

రద్దీ ఎక్కువగా ఉండే నగరాలను ఎంచుకుని, సోమవారం నుంచి జియో ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. తిరుమల, విశాఖపట్నంతోపాటు, జంట నగరాలైన విజయవాడ, గుంటూరు నగరాల్లో మొదటి విడతగా 5జీ సేవలు ప్రారంభించింది. రిలయన్స్ జియో సంస్థ ఏపీలో 5జీ సేవల కోసం రూ.6,500 కోట్ల పెట్టుబడి పెట్టింది. 5జీ సేవలు తొలిసారి అందుబాటులోకి వచ్చినదృష్ట్యా వినియోగదారులకు జియో 5జీ వెల్కమ్ ఆఫర్ కూడా అందిస్తోంది. త్వరలోనే 5జీ సేవలు అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది చివరినాటికి ఏపీలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందుతాయని జియో ప్రతినిధులు తెలిపారు. ఈ సేవల కోసం వినియోగదారులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

4జీ టారిఫ్ మీదే 5జీ టారిఫ్ అందుబాటులోకి వస్తుంది. 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగిన ఫోన్లలో సర్వీస్ ఆటోమేటిగ్గా అప్‌గ్రేడ్ అవుతుంది. స్పీడ్ ఇంటర్నెడ్, అపరిమిత డాటా వినియోగించుకోవచ్చు. ఫోన్లో వినియోగదారులు మైజియో యాప్‌లోకి వెళ్లి వెల్కమ్ ఆఫర్ పొందవచ్చు.