ఏపీ లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదు

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 12:36 PM IST
ఏపీ లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదు

Updated On : April 29, 2020 / 12:36 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయని  నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గానూ 287 మందికి నెగెటివ్ వచ్చి డిశ్చార్జ్ కాగా మొత్తం 1014 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మంగళవారం ఉదయం9 గంటల నుంచి బుధవారం ఏప్రిల్ 29, వరకు రాష్ట్రంలో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 31 గా ఉంది.  

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రుల్లో పని చేయుటకు కొత్తగా 1170 మంది డాక్టర్లను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో గుంటూరు, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో 53 కేసులు నమోదయ్యాయి. కాగా..వైరస్ ఫ్రీ జిల్లాగా విజయనగరం జిల్లా కొనసాగుతోంది.