కేంద్రం, జగన్ చెప్పింది ఇదే : ఎలాంటి చికిత్స లేకుండానే 80శాతం మంది కరోనా బాధితులు కోలుకుంటున్నారు

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 03:05 PM IST
కేంద్రం, జగన్ చెప్పింది ఇదే : ఎలాంటి చికిత్స లేకుండానే 80శాతం మంది కరోనా బాధితులు కోలుకుంటున్నారు

Updated On : March 22, 2020 / 3:05 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్నిదేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కుగా ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం స్వల్ప స్థాయిలోనే కనిపిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం నియంత్రణ చర్యలను చేపట్టింది. అయితే.. భారత్‌లో కరోనా సోకిన బాధితుల్లో 80శాతం మంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే స్వచ్ఛందంగా కోలుకుంటున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్( ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రకటించారు. 

దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారిలోనూ 20శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం వస్తోందన్నారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 5శాతం మందికి మాత్రమే కొత్తరకం మెడిసిన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఒకే రోజు 10వేల మందికి కరోనా టెస్టులు చేయగల సామర్థ్యం ఉందన్నారు. వారానికి 50వేల నుంచి 70వేల పరీక్షలు చేసేందుకు వీలుందన్నారు. ఇప్పటి వరకూ 15వేల నుంచి 17వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. 

ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించగల లక్షణాలున్న ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే తప్పనిసరిగా స్వీయ నిర్బంధమే ప్రధానమని అన్నారు. గాలిలో ఈ వైరస్ ఎక్కువ గంటలు బతికి ఉండలేదని, వైరస్ సోకిన వారు తుమ్మినా లేదా దగ్గినప్పుడు బయటకు వచ్చే నీటితుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని భార్గవ వెల్లడించారు. కరోనా నియంత్రణపై సరిగ్గా ఇదే విషయాన్ని వైస్ జగన్ కూడా ప్రస్తావించారు. 80 శాతం మంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే స్వచ్ఛందంగా కోలుకుంటున్నారని జగన్ తెలిపారు. 

See Also | నిత్యావసర సరుకుల ధరకు మించి అమ్మితే జైలుకే