Road Accident : ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు..బాలుడు మృతి
విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Road Accident Boy Died
Road Accident : విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. నగరంలోని కొత్తపేటలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అతివేగంతో రోడ్డు పక్కనున్న షాపులను ఢీకొట్టింది.
అదుపు తప్పిన కారు పక్కనే ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై దూసుకెళ్లింది. అనంతరం గోడను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో షకీల్ అనే బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పోలీసులు మృతి
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరుగగానే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు.