Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం

ఈ నెల 11న కేంద్ర జల సంఘం డైరక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలో అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసింది. ఓ నివేదికను రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు అందించింది.

Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం

Polavaram

Updated On : May 18, 2022 / 9:32 AM IST

Polavaram project : ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన సమస్యలను సరిదిద్దడం కోసం ఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ప్రాజెక్టులో కీలకమైన ‘ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం’ కోతకు గురవడంతో ఆ ప్రాంతాన్ని ఎలా పూడ్చాలన్న అంశంతో పాటు, వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఎలా పటిష్టపర్చాలన్న అంశాలపై నిపుణులతో చర్చించారు.

జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన సమాలోచలు జరిగాయి. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. నారాయణ రెడ్డితో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓవో, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నతాధికారులు, ఐఐటీ నిపుణులు హాజరయ్యారు.

Union Govt : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం షరతులు

ఈ నెల 11న కేంద్ర జల సంఘం డైరక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలో అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసింది. ఓ నివేదికను రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు అందించింది. దీని ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన లోపాలను ఎలా సరిదిద్దాలన్న అంశంపై జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాం నిపుణుల అభిప్రాయాలు సేకరించారు.

నిర్మాణ నాణ్యతలో రాజీపడకుండా, డ్యామ్ భద్రతకు పెద్దపీటవేస్తూ సరిదిద్దాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. అవసరమైతే మరోసారి ప్రాజెక్టును సందర్శించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.