మండలి రద్దు చర్చ : బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారు – ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్

మండలి రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్ (వైద్యం, ఆరోగ్యం, వైద్య విద్య శాఖ) వెల్లడించారు. వైసీపీ పార్టీకి చెందిన 151 మంది శానసభ్యులు..బిల్లులపై చర్చించి తీర్మానం చేసి శాసనమండలికి పంపిస్తే..ఏదో ఒక వంకతో ప్రతి బిల్లుకు ఆటంకం కలిగిస్తున్నారని, ఇది చాలా దారుణమని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చ జరిగింది. అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ప్రారంభమైన సభలో సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
వైసీపీ సభ్యులు ఆళ్ల కాళ్లకృష్ణ..చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీపై పలు విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంటే ఏదో చూడాలంటే..పశ్చిమ గోదావరి జిల్లాకు రావాలని సూచించారు. బాబు పాలనలో ఒక చిన్న సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. పోలరం నిర్మాణంపై దృష్టి సారించలేదన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆసపత్రులను అభివృద్ధి చేశారని తెలిపారు.
మంచినీటి సమస్యను పరిష్కరించడానికి వాటర్ గ్రిడ్ కింద రూ. 3 వేల 800 కోట్లు కేటాయించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన్నం ప్రాంతంపై కనీసం బాబు దృష్టి సారించారా ? అని ప్రవ్నించారు. ఉద్దాన్నం ప్రాంతంతో పాటు, ఇతర ప్రాంతాలకు రూ. 700 కోట్లు కేటాయించి..శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులంటూ సీఎం జగన్ నిర్ణయం చేశారని, రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి చేయాలని అనుకుంటే..టీడీపీ దీనిని వ్యతిరేకిస్తూ వస్తోందని విమర్శించారు.
స్వార్థ ప్రయోజనాలకు టీడీపీ పాల్పడుతూ..అమరావతిలో భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతలకు బాబు అండగా ఉంటున్నారని తెలిపారు. రాజధానిని తరలించడం లేదని, మిగిలిన ప్రాంతాల్లో మరో రెండు రాజధానులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రాంతీయ, అసమానతలు ఉండవని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారని వెల్లడించారు.
* విభజన సమయంలో బాబు ద్వంద్వ వైఖరి, రెండు నాల్కల ధోరణి కనబరిచిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
* అధికారదాహంతో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి విభజనకు బాబు కారకుడయ్యారు.
* ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను కోల్పోయాం. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.
* గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..ఉన్న ఉద్యోగాలను పీకేశారన్నారు.
* ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ, సీఎం జగన్ ఎలాంటి పోరాటాలు జరిపారు. హోదా కోసం పోరాడుతున్న వారిపై బాబు అక్రమ కేసులు బనాయించారు.
* అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌లో బాబు చూపించారు.
Read More :అటు సమత..ఇటు హజీపూర్ : తుది తీర్పు వాయిదా