APS RTC : ఏపీలో అడ్వాన్స్ బస్ టికెట్ రిజర్వేషన్ రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ రద్దు చేసింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది.

Advance Bus Ticket Reservations Cancelled By Apsrtc
Advance Bus Ticket Reservations : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ రద్దు చేసింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది.
బుధవారం (మే 5) నుంచి ఈ నెల 18 వరకూ ముందస్తు రిజర్వేషన్లను నిలిపివేసింది. కర్ఫ్యూ సమయంలో బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికుల పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.