ఎన్నికల తర్వాత బాబు భరతం పడతాం : రాం మాధవ్ 

  • Published By: chvmurthy ,Published On : April 7, 2019 / 09:21 AM IST
ఎన్నికల తర్వాత బాబు భరతం పడతాం : రాం మాధవ్ 

Updated On : April 7, 2019 / 9:21 AM IST

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా  సాగించిన అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతిపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన ఆదివారం రాజమండ్రిలో  ప్రకటించారు.

కాగ్ రిపోర్టుల ఆధారంగా సంబంధిత శాఖలు స్పందిస్తాయని రాం మాధవ్ చెప్పారు. ఎన్నికల తర్వాత అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని ప్రకటించారు. బీజేపీ లో నిధులు దుర్వినియోగం అయినట్టు వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తన దృష్టిలో పార్టీకి ఎవరూ రాజీనామా చేసిన దాఖలాలు లేవని రాం మాధవ్ తెలిపారు.