Srisailam Cheetah : శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం.. తీవ్ర భయాందోళనలో భక్తులు
చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. Srisailam Cheetah

Srisailam Cheetah
Srisailam Cheetah – Rudra Park : శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. రుద్రా పార్క్ వద్ద చిరుత కనిపించింది. కొందరు భక్తులు తమ ఫోన్లలో చిరుతను వీడియో తీశారు. 10 రోజుల క్రితం శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద కూడా చిరుత కనిపించింది. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో రోజురోజుకి చిరుత పులుల సంచారం పెరుగుతూ ఉంది. శ్రీశైలం.. అటవీ ప్రాంతంలో ఉంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి చిరుత పులి సంచారం చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రుద్ర పార్క్ దగ్గర చిరుతను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనని కంగారు పడుతున్నారు.
చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తున్నా.. వారు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. చిరుత పులులు తిరిగే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో చిరుత పులులు సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు మేల్కొని చిరుత పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, తిరుమలలో నడక దారిలో చిరుత పులి చిన్నారిపై దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలాంటి ఘోరం శ్రీశైలంలో జరక్కుండా ఉండేలా.. అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చిరుత దాడితో అలర్ట్ అయిన టీటీడీ అధికారులు భక్తుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిరుత పులులు తిరిగే చోట్లలో బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించారు. అయితే, తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది.
Also Read..Longest Alligator Kill : అమెరికాలో అతి పొడవైన ఎలిగేటర్‌ను చంపిన మిస్సిస్సిప్పి వేటగాళ్ళు