AP Weather: అలెర్ట్.. మూడు రోజులపాటు భారీవర్షాలు!

ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు.. పశ్చిమ గాలులు వీస్తుండడంతో

AP Weather: అలెర్ట్.. మూడు రోజులపాటు భారీవర్షాలు!

Weather Alert

Updated On : August 22, 2021 / 4:29 PM IST

AP Weather: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు.. పశ్చిమ గాలులు వీస్తుండడంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు (ఆదివారం), రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఆదివారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక.. సోమ, మంగళ వారాలలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని సూచించారు.

ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.,. సోమవారం ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మంగళవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.