Amaravati : కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన అమరావతి రైతులు..
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ ..

Amaravati Farmers
Amaravati farmers Visit Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు ఇవాళ తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు కాలినడకన వెళ్తున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకునేందుకు రాజధాని గ్రామాల రైతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి చెంతకు కాలినడక వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.
Also Read : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేసింది. అప్పట్లో వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయ్ రావు, భారీగా పోలీసులను మోహరించడంతోపాటు.. ఆయనే స్వయంగా లాఠీలతో రైతులు పై విరుచుకుపడిన విషయాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. గాయాలై, రక్తం కారుతున్నా నాడు రైతులు వెనక్కి తగ్గలేదు.
Also Read : వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి బిగ్ షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
అయితే, పోలీసులు అడ్డుకోవడంతో నాడు మొక్కు చెల్లింపు పూర్తి కాకపోవడంతో ఇవాళ అమ్మవారికి మొక్కు చెల్లించేందుకు కాలినడకన అమరావతి రైతులు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న తరువాత తమ మొక్కలను చెల్లించనున్నారు.