Nara Lokesh : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో A14గా లోకేశ్, ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో
చంద్రబాబు అరెస్ట్ అయ్యాక తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లోకేశ్. ఈక్రమంలో లోకేశ్ ను A14గా చేర్చింది సీఐడీ.

Nara Lokesh
nara lokesh Amaravati inner ring road case : స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలో ఇప్పటికే టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు తాజాగా నారా లోకేశ్ పై కూడా కేసులు నమోదు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ లోకేశ్ ను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయ్యాక తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని..స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగింది అంటూ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అనే విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లోకేశ్.
Nara Lokesh : ప్రజలు జగన్ ప్రభుత్వానికి పాడె కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : నారా లోకేశ్
జరిగింది అన్యాయం అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుక లోకేశ్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతున్న క్రమంలో లోకేశ్ మీద కూడాసీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 ముద్దాయిగా పేర్కొంది అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలా అక్రమ అరెస్టులు చేసి నిజాల్ని కప్పిపుచ్చాలనే కుట్రతోనే ఇటువంటి చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోంది అంటూ విమర్శిస్తున్నారు.
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసు విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసింది. దీంట్లో భఆగంగానే ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అసలు డిజైన్ ను అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు మార్పులు చేశారు అంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి గతంలోనే సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ పక్క చంద్రబాబు అరెస్ట్..హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేత. రిమాండ్ పొడిగింపు..సుప్రీంకోర్టును ఆశ్రయించినా సెప్టెంబర్ 26న విచారణకు వస్తుందనుకున్న క్వాష్ పిటీషన్ విచారణకు రాకపోవటం వంటి పరిణాలతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీడీపీని తాజాగా లోకేశ్ ను ఏ14గా చేర్చటం..దీనిపై అరెస్ట్ చేస్తారనే వార్తలు రావటంతో పార్టీని నడిపించేది ఎవరు..? పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరు..? అంతటి సమర్ధులు ఎవరున్నారు..? అసలు టీడీపీ పరిస్థితి ఏంటీ అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.