Kurnool Ancient Locker: తీవ్ర ఉత్కంఠ మధ్య ఆ పురాతన బీరువాను తెరిచిన అధికారులు.. తీరా చూస్తే అందులో..

రెండో రోజులుగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో అమితాసక్తి రేపిన భోషాణాన్ని అధికారులు ఎట్టకేలకు తెరిచారు. అందులో ఉన్నది చూసి అందరూ షాకయ్యారు.

Kurnool Ancient Locker: తీవ్ర ఉత్కంఠ మధ్య ఆ పురాతన బీరువాను తెరిచిన అధికారులు.. తీరా చూస్తే అందులో..

Andhra Pradesh

Updated On : April 4, 2023 / 5:49 PM IST

Kurnool Ancient Locker: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పురాతన బీరువా బయటపడడంతో అందులో బంగారం, నగలు, వజ్ర వైఢూర్యాలు ఉండొచ్చని ప్రచారం జరిగింది. బీరువాను తెరవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. దాన్ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇంత ఉత్కంఠ మధ్య బీరువాను తెరిచారు. తీరా చూస్తే అందులో చెత్త ఉంది.

ఎంతో ఆశతో తెరిచాక ఊసురుమనిపించింది ఆ భోషాణం. బీరువాలో బంగారం, నగలు, వజ్ర వైఢూర్యాలు ఉండొచ్చని మొదట విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో అందులో ఉన్న ఆ అత్యంత విలువైన నగలకు నష్టం వాటిల్లకూడదని వెల్డర్ ను పిలిపించి మరీ బీరువాని తెరిపించారు. గ్యాస్ కటర్ తో పురాతన బిరువాను తెరిచాడు వెల్డర్. పోలీసు,రెవెన్యూ, గ్రామ పెద్దల సమక్షంలో ఈ తంతు జరిగింది.

పురాతన బీరువాలో విలువైన వస్తువులు లేకపోవడంతో స్థానికులు నిరాశకు గురయ్యారు. ఆ పురాత బీరువాలో విలువైన వస్తువులు ఉంటాయని ఉదయం నుంచి వేచి చూసిన స్థానికులు ఇక తమ ఇళ్లకు వెళ్లిపోయారు. బీరువాను తెరిచేందుకు రెండు రోజులుగా ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్న విషయం తెలిసిందే. ఆ పురాతన బీరువాలో విలువైన వస్తువులు లేకపోవడం, పనికిరాని పాత్రలు, ఎవో పాత డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Andhra Pradesh : ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ పురాతన బీరువా .. బంగారు నిధులున్నాయా?