Corona Cases AP : ఏపీలో 4,417 కరోనా కేసులు, 38 మంది మృతి

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి

Corona Cases AP :  ఏపీలో 4,417 కరోనా కేసులు, 38 మంది మృతి

Corona Cases Ap

Updated On : June 26, 2021 / 5:52 PM IST

Corona Cases AP : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 4 వేల 417 మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

46 వేల 126 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 566మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 838 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,75,622 పాజిటివ్ కేసులకు గాను, 18,16,930 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, విశాఖపట్నం ఇద్దరు, విజయనగరం ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 180. చిత్తూరు 569. ఈస్ట్ గోదావరి 838. గుంటూరు 321. వైఎస్ఆర్ కడప 226. కృష్ణా 310. కర్నూలు 160. నెల్లూరు 196. ప్రకాశం 289. శ్రీకాకుళం 128. విశాఖపట్టణం 229. విజయనగరం 130. వెస్ట్ గోదావరి 571. మొత్తం : 4,417