Curfew: ఏపీలో కర్ఫ్యూ సడలింపులు.. ఎనిమిది జిల్లాల్లోనే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సడలింపులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని మరింతగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Curfew
Andhra Pradesh Government Curfew: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సడలింపులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని మరింతగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే ఇకపై కర్ఫ్యూ కొనసాగనుంది. కొవిడ్ పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపులను ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ సడలింపు సమయం జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఐదు జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల వరకే సడలింపు ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఐదు జిల్లాల్లో సడలింపుపై మరోసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.