AP Covid Cases : ఏపీలో కొత్తగా 103 కోవిడ్ కేసులు… 175 మంది కోలుకున్నారు

ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు.

AP Covid Cases : ఏపీలో కొత్తగా 103 కోవిడ్ కేసులు… 175 మంది కోలుకున్నారు

Ap Covid Cases

Updated On : December 22, 2021 / 6:05 PM IST

AP Covid Cases :  ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 20,76,077 కి చేరింది. కోవిడ్ తో కోలుకున్న వారిసంఖ్య 20,60,236కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. కోవిడ్ వల్ల కృష్ణాజిల్లాలో ఒకరు. గుంటూరు జిల్లాల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 14,483 కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,10,67,410 మంది శాంపిల్స్ పరీక్షించటం జరగిందని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. మొదటికేసు విజయనగరంలోనమోదవ్వగా రెండో కేసు నేడు తిరుపతిలోనమోదయ్యింది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది.
Also Read : Omicron In India : దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ సమీక్ష!
దీంతో శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు అధికారులు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ రీపోర్ట్‌లో ఆమెకు ఒమిక్రాన్ వేరియంట్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా నెగటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.