AP Covid Update : ఏపీలో పెరిగిన కోవిడ్ కేసులు-కొత్తగా 840 మందికి కోవిడ్

ఆంధప్రదేశ్‌లో  కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్

AP Covid Update  : ఏపీలో పెరిగిన కోవిడ్ కేసులు-కొత్తగా 840 మందికి కోవిడ్

AP Covid update

Updated On : January 7, 2022 / 4:43 PM IST

AP Covid Update :  ఆంధప్రదేశ్‌లో  కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది.

నిన్న 133 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కోవిడ్ తదితర కారణాల వల్ల నిన్న విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇంతవరకు 20,79,763 మందికి కొవిడ్ సోకగా, వారిలో 20,62,290 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,972 క్రియాశీల కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ లో పేర్కోన్నారు.
Also Read : Vanama Raghava : వనమా రాఘవను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ
ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ తదితర కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య 14 వేల 501 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,15,19, 919 మంది శ్యాంపిల్స్ పరీక్షించారు. మరోవైపు రాష్ట్రంలో జనవరి 8 నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నారని… 50% ఆక్యుపెన్సీతో ధియేటర్లు రెస్టారెంట్లు, ఆఫీసులు నిర్వహిస్తారనే వార్త సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.