Andhra Praesh Covid Update : ఏపీలో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు

ap covid cases up date
Andhra Praesh Covid Update : ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా… పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు కోవిడ్ వల్ల మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 క్రియా శీలక కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,15,67,472 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 20,80,602 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 20,62,440 మంది కోవిడ్ నుంచి కోలుకోగా…. 14,503 మంది కోవిడ్ తదితర కారణాల వల్ల మరణించారు.
రాష్ట్రంలో నిన్న అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కోవిడ్ కేసులు నమోదు కాగా…. విశాఖ జిల్లాలో 174, కృష్ణాజిల్లాలో 79, ఈస్ట్ గోదావరి లో 78 గుంటూరు జిల్లాలో 67 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
గత వారంతో పోలిస్తే రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 940 కోవిడ్ కేసులు నమోదు కాగా గత ఐదు రోజుల్లోనే (సోమవారం నుంచి శుక్రవారం వరకు) 2,155కి పాజిటివ్ కేసులు పెరిగాయి. గత వారంతో పోలిస్తే 43.61 శాతం కేసులు అదనంగా నమోదు అయ్యాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో 28 ఒమిక్రాన్ కేసులు బయట పడ్డాయి. రాబోయే సంక్రాంతి పండగకి ఇతర రాష్ట్రాలనుంచి రాష్ట్రానికి వస్తున్న వారి వల్ల కూడా కేసుల సంఖ్య పెరగటానిక కారణంగా తెలుస్తోంది. పండుగపూట షాపింగ్ లు జరగటం, ప్రజలు సరైన కోవిడ్ నిబంధనలు పాటించకపోవటంతో కేసులు పెరుగుతున్నాయి.
Also Read : Teenagers Vaccination : 6 రోజుల్లో 2 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి
ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ…మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని వైద్యలు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పరీక్షళ సంఖ్యను పెంచుతోంది. గత వారం రోజుల్లో కోవిడ్ నిబంధనలు పాటించని 9,814 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఈరోజు సాయంత్రం పాత ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఒమిక్రాన్ వార్డును సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ప్రారంభించనున్నారు.

Ap Covid Cases