Andhra Pradesh Corona : ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. గురువారం కొత్తగా

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్.

Andhra Pradesh Corona : ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. గురువారం కొత్తగా

Andhra Pradesh Corona

Updated On : January 6, 2022 / 6:35 PM IST

Andhra Pradesh Corona : ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే విశాఖ జిల్లాలో 89, కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 49 కేసులు గుర్తించారు.

చదవండి : Andhra Pradesh : సర్పంచులకు శుభవార్త.. జీవో నం.2 వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 128 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,78,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,62,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,266 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,500కి చేరింది.

చదవండి : Andhra Pradesh : ఏడుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా