AP Covid Update : ఏపీలో కొత్తగా 4,108 కోవిడ్ కేసులు… జీరో మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.

AP Covid Update : ఏపీలో కొత్తగా 4,108 కోవిడ్ కేసులు… జీరో మరణాలు

Ap Covid Cases

Updated On : January 17, 2022 / 6:05 PM IST

AP Covid Update :  ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. వీరిలో 20,65,696 మంది కోవిడ్ కు చికిత్స పొంది క్షేమంగా ఇళ్లకు వెళ్లారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. నిన్న 696 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,18,84, 914 మందికి కోవిడ్ పరీక్షలునిర్వహించారు. నిన్న 22,882 మందికి పరీక్షలు నిర్వహించారు.

Also Read :Ganja Seized : 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిన్న అత్యధికంగా విశాఖ జిల్లాలోల 1018 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అనంతరం చిత్తూరులో 1,004, గుంటూరు జిల్లాలో 345, వైఎస్సార్ కడపజిల్లాలో 295, తూర్పు గోదావరి జిల్లాలో 263,నెల్లూరు జిల్లాలో 261 కేసులు నమోదయ్యాయి.