రైతులకు బిగ్ అలర్ట్.. రేపే చివరి తేదీ.. అన్నదాత సుఖీభవ లిస్ట్‌లో మీ పేరు లేకుంటే ఇలా చేయండి.. డబ్బులొచ్చేది ఆ రోజే..

అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.

రైతులకు బిగ్ అలర్ట్.. రేపే చివరి తేదీ.. అన్నదాత సుఖీభవ లిస్ట్‌లో మీ పేరు లేకుంటే ఇలా చేయండి.. డబ్బులొచ్చేది ఆ రోజే..

Annadata Sukhibhav scheme

Updated On : July 12, 2025 / 11:40 AM IST

Annadata Sukhibhava Scheme: ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతులకు పంట సాగులో ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రతీయేటా అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు అందించేందుకు సిద్ధమైంది. ఈనెలలో మొదటి విడత డబ్బులను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు మూడు విడతల్లో రూ.20వేలు జమ చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతీయేటా రైతులకు రూ.6వేలు అందిస్తుంది. వీటికితోడు ఏపీలోని కూటమి ప్రభుత్వం రూ.14వేలు కలిపి రూ.20వేలు జమ చేయనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అందజేస్తారు. పీఎం కిసాన్ పథకం డబ్బులు రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవం పథకం కింద రూ.14వేలను మూడు విడతల్లో పీఎం కిషాన్ నిధులతో రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.

ఈనెల 21వ తేదీన పీఎం కిసాన్ కింద రూ.2వేలు జమ చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాటితోపాటు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలను రాష్ట్ర ప్రభుత్వం అదేరోజు జమ చేయనుంది. దీంతో మొత్తం రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమ కానున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలను అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్‌లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటలో ఉంచారు. ‘మనమిత్ర’ యాప్ ద్వారా కూడా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. పథకంకు అర్హత ఉండి మీ పేరు ఫైనల్ లిస్టులో లేకుంటే ఈనెల 13వ తేదీలోగా రైతులు వివరాలను సమర్పిస్తే.. అధికారులు పరిశీలించి జాబితాలో చేరుస్తారు.

ఇవి తెలుసుకోండి..
♦ మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే.. https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి Know Your Status పై క్లిక్ చేయాలి. అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసి.. Search పై క్లిక్ చేయాలి. ‘మనమిత్ర’ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తనిఖీ చేసుకోవచ్చు.
♦ అన్నదాత సుఖీభవ పథకానికి డీకేటీ పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములున్నవారు అర్హులు. ప్రభుత్వ భూమి సాగుదారులు అనర్హులు.
♦ ఈ పథకం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ కుటుంబం నుంచి వేరే పడితే గ్రామ వార్డు సచివాలయం నుంచి కుటుంబ సర్వే పూర్తి చేయించుకోవాలి.
♦ రైతు భూమి వెబ్‌ ల్యాండ్‌లో వేరొక ఆధార్‌తో అనుసంధానం చేసి ఉంటే సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలిసి సరైన ఆధార్‌ను అనుసంధానించుకోవాలి.
♦ తప్పు ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నా, చనిపోయినవారి భూమి మ్యుటేషన్‌ జరగాల్సి ఉన్నా, వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌కు జత కాలేదని గుర్తించినా ఇతర కారణాలున్నా సంబంధిత వీర్వోను సంప్రదించి సరిచేసుకున్న తరువాత రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకుని ద్వారా దరఖాస్తు చేయాలి.