అంత దమ్ము ఎవరికీ లేదు.. అందుకే ఇలా చేస్తున్నారు: అనిల్ కుమార్ యాదవ్

Anil kumar yadav: వైసీపీని ఎదుర్కోవడానికి ఎంతమంది వచ్చినా జగన్‌ మరోసారి గెలిచి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు.

అంత దమ్ము ఎవరికీ లేదు.. అందుకే ఇలా చేస్తున్నారు: అనిల్ కుమార్ యాదవ్

Anil kumar yadav

Updated On : March 10, 2024 / 4:38 PM IST

Anil Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన సిద్ధం సభలో అనిల్ కుమార్ మాట్లాడారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఏపీ ఎన్నికల్లో సత్తా చూపించాలని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, అందుకే పొత్తులు పెట్టుకున్నారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. వైసీపీని ఎదుర్కోవడానికి ఎంతమంది వచ్చినా జగన్‌ మరోసారి గెలిచి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. జగన్ కు అన్ని వర్గాల వారి మద్దతు ఉందని చెప్పారు.

జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మరో 45 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, జగన్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు జగనన్నను మరోసారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

కాగా, వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న చివరి సిద్ధం సభ ఇది. సభకు భారీగా ఏర్పాట్లు చేసింది వైఎస్సార్సీపీ. చివరి సభ కావడంతో జగన్   ఏం చెబుతారన్న దానిపై క్యాడర్ లో ఆసక్తి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ఖరారైన తరువాత సీఎం చేయనున్న తొలి ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు