Anil Kumar Yadav: ఎన్నికల వేళ వైసీపీలో సీట్ల మార్పుపై ఎమ్మెల్యే అనిల్ ఆసక్తికర కామెంట్స్
మార్పులు జరిగిన స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిపారు. అయితే...

MLA Anil Kumar Yadav
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో చిన్న పొరపాటు జరిగినా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. పేద ప్రజలకు సీఎం జగన్ అండగా ఉంటున్నారని అన్నారు. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
గత టీడీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి ఆలోచించలేదని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేల స్థానాలను మాత్రమే జగన్ మార్చుతున్నారంటూ టీడీపీ అసత్య ప్రచా రం చేస్తోందని మండిపడ్డారు.
మార్పులు జరిగిన స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిపారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ఎలాంటి మార్పులు చేసినా తాము అందరం స్వాగతిస్తామని అన్నారు. నెల్లూరులో పనికిరాని ముగ్గురు ఎమ్మెల్యేలను టీడీపీ చేర్చుకుందని చెప్పుకొచ్చారు. జగన్‌ను మళ్లీ సీఎంను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.
Revanth Reddy: అందుకే మోదీతో గంటసేపు చర్చించాం: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క