Revanth Reddy: అందుకే మోదీతో గంటసేపు చర్చించాం: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని..

Revanth Reddy: అందుకే మోదీతో గంటసేపు చర్చించాం: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

Revanth-Modi-bhatti

Updated On : December 26, 2023 / 6:53 PM IST

ఢిల్లీలో ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మోదీని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను అడిగామనన్నారు.

సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా మోదీని కలిశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెచ్చుకున్నామని అన్నారు. ఈ మూడు విషయాలపై గత బీఆర్ఎస్ సర్కారు తాత్సారం చేసిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కారు నిధులు తీసుకురాలేకపోయిందని భట్టి విక్రమార్క అన్నారు. తాము విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు.

అలాగే, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి విజ్ఞప్తులు చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని అన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వివరించారు.