అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు లేదా..? నో ప్రాబ్లం.. వెంటనే ఇలా చేయండి.. రైతుల కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ కూడా వచ్చేసింది..

అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు లేదా..? నో ప్రాబ్లం.. వెంటనే ఇలా చేయండి.. రైతుల కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ కూడా వచ్చేసింది..

Annadata sukhibhava

Updated On : July 4, 2025 / 11:29 AM IST

Annadata sukhibhava scheme 2025: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీయేటా రైతుల ఖాతాల్లో రూ.6వేలను మూడు దఫాల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే డబ్బులకుతోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి ప్రతీయేటా రైతు అకౌంట్‌లో రూ.20వేలు జమ కానున్నాయి. అయితే, తొలి విడుతకు సంబంధించిన నిధులను మరో వారంరోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.

లిస్టులో మీ పేరు లేదా..?
తొలి విడతలో భాగంగా కేంద్రం రూ.2వేలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు కలిపి మొత్తం రూ.7వేలు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకంకు అర్హత కలిగిన రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అర్హత కలిగిన రైతుల జాబితాను ప్రభుత్వ వెబ్ సైట్‌తోపాటు.. సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. పథకానికి అర్హత ఉండి.. లిస్టులో పేరులేని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, అలాంటి రైతుల కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.

ఇలా చేయండి..
అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకం అర్హతకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు. గ్రీవెన్స్ మాడ్యూల్ ను శుక్రవారం విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వెబ్ ల్యాండ్‌లో డేటా సరిచేయించుకోకపోతే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు.
‘‘అన్నదాత సుఖీభవ పథకం లిస్టులో పేరు లేని రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుడు, వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు అందిస్తే అక్కడ సిబ్బంది పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ పథకం కింద అర్హుల జాబితా ఇప్పటికే పూర్తయింది. వారి వివరాలను పోర్టల్‌లో ఉంచారు. రైతులు ఆధార్ నంబరు నమోదు చేసి అర్హులో కాదో తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైతే .. 155251 నెంబర్‌కు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.’’ అని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకానికి తాము అర్హులమో కాదో రైతులు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి.. అక్కడ చెక్ స్టేటస్ ఆప్షన్‌ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండే కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి.