పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం

Updated On : February 22, 2021 / 10:22 AM IST

Polavaram project construction : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ మరో రికార్డ్‌ సృష్టించింది. కీలకమైన స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటును జెట్‌స్పీడ్‌లో పూర్తి చేసింది. వరదలకు ముందే స్పిల్‌ వే పిల్లర్లపై గడ్డర్లను అమర్చి… ప్రాజెక్టు పనులకు అడ్డంకి లేకుండా రూట్‌క్లియర్‌ చేసింది.

ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కీలకమైన స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయింది. స్పిల్‌ వే బ్రిడ్జి నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్లను… కేవలం 60 రోజుల్లోనే పిల్లర్లపై అమర్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. స్పిల్ వేపై గడ్డర్లు ఏర్పాటు పూర్తి కావడంతో.. ఇక షట్టరింగ్ పనులు చేసి స్లాబ్ నిర్మాణంపై ఇంజినీర్లు ఫోకస్‌ చేశారు.

పోలవరం ప్రాజెక్టులో ఒక్కో గడ్డరు 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు ఉండగా… ఒక్కో గడ్డరు తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు ఉండగా.. మొత్తం గడ్డర్ల తయారీకి వెయ్యి 920 టన్నుల స్టీల్, 4 వేల 800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. 200 టన్నుల రెండు భారీ క్రేన్ల సాయంతో గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి ఉపయోగించారు.

పోలవరం ప్రాజెక్టులో ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంతో అదే స్థాయిలో భారీ గడ్డర్ల వినియోగించారు. ఎప్పటికప్పుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌తో పాటు అధికారులు పర్యవేక్షించారు. గతేడాది ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ…. ఇరిగేషన్‌ అధికారులతో కలిసి పక్కా ప్రణాళికో వరదలకు ముందే స్పిల్‌ వే పిల్లర్లపై గడ్డర్లను అమర్చింది. గతేడాది జులై 6 నాటికి గడ్డర్లను స్పిల్ వే పిల్లర్ల అమర్చడం పూర్తిచేశారు. గోదావరికి భారీ వరదలు వచ్చినా.. పనులు ఆగకుండా స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ నిర్మాణాన్ని చేపట్టారు.