టీటీడీలో నిధులు గోల్ మాల్ : ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో రూ. 4కోట్ల రూపాయల నిధులు కుంభ కోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్, ఢిల్లీ లోకల్ ఎడ్వైజరీకమిటీ చైర్మన్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను ఆయన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు పంపించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న వెంకటేశ్వరస్వామి గుడిలో అవకతవకలు జరిగాయని ఒక భక్తుడు టీటీడీ ఈవో కు ఫిర్యాదు చేశాడు.
ఈ ఆలయం ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షణలో ఉంది. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తున్న సమయంలో ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ జోక్యంతో విచారణ ముందుకు సాగలేదనే ఆరోపణలు వచ్చాయి. వీటి కారణంగానూ ఆయన తన పదవికి రాజీనామాచేసినట్లు తెలుస్తోంది.